నెల్లూరు జిల్లా చెన్నాయ పాలెంలో వైసిపి టీడీపీ మధ్య ఘర్షణ
నెల్లూరు,06 మార్చి (హి.స.)నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలో రాజకీయ సెగలు మరోసారి రాజుకున్నాయి. చెన్నాయపాళెంలో వైసీపీ( తెలుగుదేశం( శ్రేణుల మధ్య జరిగిన ఘర్షణ తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. చెన్నాయపాళె ప్రాంతంలో వైసీపీ మూకలు ఒక్కసారిగా రెచ్చిపోయాయ
నెల్లూరు జిల్లా చెన్నాయ పాలెంలో వైసిపి టీడీపీ మధ్య ఘర్షణ


నెల్లూరు,06 మార్చి (హి.స.)నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలో రాజకీయ సెగలు మరోసారి రాజుకున్నాయి. చెన్నాయపాళెంలో వైసీపీ( తెలుగుదేశం(

శ్రేణుల మధ్య జరిగిన ఘర్షణ తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. చెన్నాయపాళె ప్రాంతంలో వైసీపీ మూకలు ఒక్కసారిగా రెచ్చిపోయాయి. టీడీపీ శ్రేణులపై మూకుమ్మడిగా దాడికి పాల్పడ్డారు. టీడీపీ కార్యకర్తలపై విచక్షణా రహితంగా వైసీపీ మూకలు కర్రలతో దాడి చేశారు.

దాడిలో టీడీపీ శ్రేణులు శ్రీకీర్తి ప్రభాకర్, రామకోటయ్య గాయపడ్డారు. వారి పరిస్థితి విషమంగా ఉండటంతో కావలి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ నుంచి వారిని నెల్లూరు నారాయణ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ప్రస్తుతం వారికి వైద్య చికిత్స అందిస్తున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande