
జగిత్యాల, 06 మార్చి (హి.స.)
జగిత్యాల జిల్లా మెట్ పల్లి బస్టాండ్
అధికారులు ఇన్ గేట్ వద్ద గల పురాతన హనుమాన్ దేవాలయ గోడలు కూలడంతో నూతనంగా గద్దెలను, గోడలను నిర్మించారు. అయితే గురువారం రాత్రి మెట్ పల్లి ఆర్టీసీ నూతన గద్దెలను, గోడలను తొలగించేందుకు యత్నించగా ఆర్ఎస్ఎస్, హిందూ సంఘాలు ఆర్టీసీ అధికారులతో కూల్చివేత ఆపాలని వాగ్వాదానికి దిగారు. జగిత్యాల నుంచి నిజామాబాద్ వెళ్తున్న ఎంపీ ధర్మపురి అరవింద్ మెట్ పల్లికి చేరుకొని సమస్య పెద్దది చేయవద్దని యధావిధిగా కొనసాగించాలని మీ పని బస్సులు నడపడమే తప్ప ఇలాంటి పనులకు శ్రీకారం చుట్టారాదని ఆర్టీసీ అధికారులపై ఆగ్రహించారు. దేవాలయం యధాతథంగా కొనసాగుతుందని భక్తులకు ఎంపీ అర్వింద్ హామీ ఇవ్వడంతో శాంతించిన హిందూ సంఘాల నేతలు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు