హైకమాండ్ వద్ద రేవంత్ రెడ్డి 'పవర్'.. వేం నరేందర్ రెడ్డి ఎంపికతో పెరిగిన ఇమేజ్!
హైదరాబాద్, 06 మార్చి (హి.స.) రాజ్యసభ అభ్యర్థుల ఎంపికలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తీసుకున్న నిర్ణయం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఇమేజ్ను మరింత పెంచింది. ఆయన ముఖ్య అనుచరుడు, సీఎం సలహాదారుడు వేం నరేందర్రెడ్డి అభ్యర్థిత్వాన్ని హైకమాండ్ ఆమోదించడం ఇతర పా
Cm revanth


హైదరాబాద్, 06 మార్చి (హి.స.)

రాజ్యసభ అభ్యర్థుల ఎంపికలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తీసుకున్న నిర్ణయం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఇమేజ్ను మరింత పెంచింది.

ఆయన ముఖ్య అనుచరుడు, సీఎం సలహాదారుడు వేం నరేందర్రెడ్డి అభ్యర్థిత్వాన్ని హైకమాండ్ ఆమోదించడం ఇతర పార్టీల్లోనే కాదు కాంగ్రెస్లోని పలువురు నేతలనూ ఆశ్చర్యానికి గురి చేసింది. సీఎం రేవంత్రెడ్డి మాట అదిష్టానం వద్ద నడవటంలేదని, అపాయింట్మెంట్ ఇవ్వడంలేదంటూ జరిగిన ప్రచారం అంతా వట్టిదేనని, ఆయన వ్యతిరేకులు చేస్తున్న ప్రచారామేనని తాజా పరిణామంతో స్పష్టమైంది. రేవంత్రెడ్డికి అత్యంత సన్నిహితుడైన వేం నరేందర్రెడ్డిని పెద్దల సభకు పంపించడం ద్వారా ఆయన మాటకే అధిష్టానం ప్రాధాన్యం ఇస్తుందని తేటతెల్లమైందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. కీలక అంశాల విషయంలో ముఖ్యమంత్రి మాట లేదా ఏఐసీసీ ప్రతిపాదనలు, సిఫార్సులు అమలు జరుగుతున్నాయని గుర్తు చేస్తున్నారు. గతంలో పీసీసీ అధ్యక్షుడి నియామకంపై ఎన్ని పేర్లు ప్రచారంలో వినిపించినా రేవంతూచించిన మహేశ్కుమార్ గౌడ్నే అధిష్టానం నియమించింది.

మంత్రివర్గ విస్తరణ, గతంలో రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక, ఎమ్మెల్సీగా అద్దంకి దయాకర్, కంటోన్మెంట్, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అభ్యర్థుల ఎంపిక.. ఇలా అనేక సందర్భాల్లో రేవంత్రెడ్డి పైచేయిగా సాగుతోంది. తాజాగా జరిగిన రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక విషయంలోనూ ఇదే జరిగిందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇదే ఉత్సాహంతో రాబోయే రోజుల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికలు, అంతకంటే ముందు జరిగే స్థానిక సంస్థల ఎమ్మెల్సీల ఎన్నికల్లోనూ రేవంత్ తనదైన ముద్ర వేస్తారని అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలోనే రెండోసారి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందని రేవంత్ పలు సందర్భాల్లో ధీమా వ్యక్తం చేస్తున్నారు. తాను సూచించిన వారికే అత్యధిక టిక్కెట్లు వచ్చే విధంగా ఇప్పటి నుంచే ఆయన వ్యూహానికి పదును పెడుతున్నట్లుగా సమాచారం. నియోజకవర్గాల పునర్విభజన, మహిళా బిల్లు అమలుతో అత్యధికులు కొత్తవారే బరిలో ఉంటారని అంచనా వేస్తున్నట్లుగా తెలుస్తోంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande