రాజ్యసభలో పెరగనున్న కాంగ్రెస్ జోరు.. తగ్గుతున్న బీఆర్ఎస్ బలం!
హైదరాబాద్, 06 మార్చి (హి.స.) రాజ్యసభలో తెలంగాణ నుంచి కాంగ్రెస్ బలం ఈ ఎన్నికల తర్వాత నాలుగుకి చేరనున్నది. తెలంగాణ నుంచి ఏడుగురు సభ్యులు రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తుండగా వారిలో ప్రస్తుతం బీఆర్ఎస్ నుంచి నలుగురు, కాంగ్రెస్ నుంచి ముగ్గురు సభ్యులు ఉన్
Rajya Sabha


హైదరాబాద్, 06 మార్చి (హి.స.)

రాజ్యసభలో తెలంగాణ నుంచి కాంగ్రెస్ బలం ఈ ఎన్నికల తర్వాత నాలుగుకి చేరనున్నది. తెలంగాణ నుంచి ఏడుగురు సభ్యులు రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తుండగా వారిలో ప్రస్తుతం బీఆర్ఎస్ నుంచి నలుగురు, కాంగ్రెస్ నుంచి ముగ్గురు సభ్యులు ఉన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచిన రెండు రాజ్యసభ సీట్లు ఖాళీ కాగా రేణుకా చౌదరి, అనిల్కుమార్ యాదవ్ కాంగ్రెస్ తరఫున రాజ్యసభ సభ్యులుగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత బీఆర్ఎస్ సభ్యుడు కేశవరావు కాంగ్రెస్లో చేరి తన పదవికి రాజీనామా చేయగా ఖాళీ అయిన ఆ సీటును సింఘ్వీకి కేటాయించారు. దీంతో రాష్ట్రం నుంచి రాజ్యసభలో కాంగ్రెస్ బలం మూడుకు చేరింది.

బీఆర్ఎస్లో మిగిలింది వీరే..

ఈ క్రమంలో బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు కేఆర్ సురేశ్రడ్డి, కాంగ్రెస్ సభ్యుడు సింఘ్వీల పదవీకాలం ఈ ఏడాది ఏప్రిల్ 9న ముగియనుండగా ఆ స్థానాలకు ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్నాయి. తాజా ఎన్నికల్లో సింఘ్వీ, వేం నరేందర్రెడ్డి ఎన్నిక ద్వారా కాంగ్రెస్ బలం నాలుగుకు చేరనుంది. కాగా, సురేశ్రడ్డి పదవీ కాలం ముగిస్తే.. బీఆర్ఎస్ నుంచి రాజ్యసభలో పార్థసారధిరెడ్డి, దామోదర్రావు, వద్దిరాజు రవిచంద్రలు ప్రాతినిధ్యం వహిస్తారు. పార్థసారధిరెడ్డి, దామోదర్రావుల పదవీకాలం 2028, జూన్ 21 వరకు ఉన్నది. మరో రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర 2030, ఫిబ్రవరి 19వ తేదీ వరకు ఎంపీగా కొనసాగనున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande