బేగంపేట్ వాతావరణ శాఖ కార్యాలయానికి బాంబు బెదిరింపు..
హైదరాబాద్, 06 మార్చి (హి.స.) హైదరాబాద్ నగరంలో ఉన్న బేగంపేట్ వాతావరణ శాఖ కేంద్రానికి శుక్రవారం బాంబు బెదిరింపు రావడంతో బాంబు స్క్వాడ్ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. బాంబు నిర్వీర్య దళం, అడుగడుగునా క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. ఉదయం 6 గంటలక
బాంబు బెదిరింపు


హైదరాబాద్, 06 మార్చి (హి.స.)

హైదరాబాద్ నగరంలో ఉన్న బేగంపేట్ వాతావరణ శాఖ కేంద్రానికి శుక్రవారం బాంబు బెదిరింపు రావడంతో బాంబు స్క్వాడ్ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. బాంబు నిర్వీర్య దళం, అడుగడుగునా క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. ఉదయం 6 గంటలకు వాతావరణ శాఖకు మెయిల్ ద్వారా బాంబు ఉందంటూ గుర్తుతెలియని అగంతకులు ఈమెయిల్ సందేశం పంపారు. దీనితో వెంటనే అలర్ట్ అయిన సంబంధిత అధికారులు ఉదయం మెయిల్ చూసుకుని పోలీసులకు మరియు వాతావరణ కేంద్రం అధికారులు సమాచారం ఇచ్చారు. బేగంపేట ఏసీపి గోపాలకృష్ణ స్థానిక సీఐ, ఎస్ఐలు, విస్తృత తనిఖీలు నిర్వహించారు. ఎలాంటి బాంబు లేదని స్థానిక పోలీసులు నిర్ధారించారు. కాగా ఈమధ్య పలు పాఠశాలలకు, ప్రభుత్వ కార్యాలయాలకు బాంబు బెదిరింపులు రావడం సర్వసాధారణంగా మారింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande