
నాగర్కర్నూలు , 06 మార్చి (హి.స.): జిల్లా సోమశిల సమీపంలో కృష్ణా నదిపై ప్రతిపాదించిన ఐకానిక్ వంతెన ప్రాజెక్టులో కీలక ముందడుగు పడింది. జాతీయ రహదారి-167కే విస్తరణ కోసం 24.66 హెక్టార్ల(60 ఎకరాలు) అటవీ భూమిని మళ్లించేందుకు కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ సూత్రప్రాయ ఆమోదం తెలిపింది. చెన్నైలోని కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ ప్రాంతీయ కార్యాలయంలో ఫిబ్రవరి ఆఖరి వారంలో నిర్వహించిన సమావేశంలో స్టేజ్-1 అటవీ అనుమతులిచ్చింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణల మధ్య కృష్ణా నదిపై సుమారు రూ.1,000 కోట్లకుపైగా వ్యయంతో ఐకానిన్ వంతెన నిర్మించనున్నట్లు కేంద్రం ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. బ్రిడ్జి పూర్తయితే హైదరాబాద్-తిరుపతి మధ్య 80 కి.మీ. దూరం తగ్గుతుంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ