కేజీబీవీ పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్
జనగామ, 06 మార్చి (హి.స.) అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మెనూ ప్రకారం పౌష్టికాహారం అందించడంతో పాటు పాఠశాల పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలని జనగామ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. బచ్చన్నపేట మండల కేంద్ర పరిధిలో ఉన్న కేజీబీవీ పాఠశాలన
Janagama collector


జనగామ, 06 మార్చి (హి.స.)

అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మెనూ ప్రకారం పౌష్టికాహారం అందించడంతో పాటు పాఠశాల పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలని జనగామ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. బచ్చన్నపేట మండల కేంద్ర పరిధిలో ఉన్న కేజీబీవీ పాఠశాలను శుక్రవారం జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలోని కిచెన్ను సందర్శించి కూరగాయలు తాజాగా ఉన్నాయా లేదా అని పరిశీలించారు. వంట సరుకుల నాణ్యతను తనిఖీ చేయడంతో పాటు గుడ్లను నీటిలో వేసి వాటి నాణ్యతను స్వయంగా పరిశీలించారు.

పాఠశాల ప్రాంగణాన్ని ప్రతిరోజూ పరిశుభ్రంగా ఉంచుకోవాలని సిబ్బందికి సూచించారు. ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరు వివరాలను ఎసీను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులతో మాట్లాడి ఉదయం అల్పాహారం ఏం ఇచ్చారు, ఎలా ఉందని ఆరా తీశారు. విద్యార్థులకు మెనూ ప్రకారం పౌష్టికాహారం అందించాలని కలెక్టర్ స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో ఎస్ఓ గీత తదితరులు పాల్గొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande