రాజ్యసభలో బీసీలకు చోటు కల్పించకపోవడం దురదృష్టకరం: ఎంపీ ఆర్ కృష్ణయ్య
హైదరాబాద్, 06 మార్చి (హి.స.) బీసీలకు మంత్రివర్గంలో అన్యాయం జరిగిందని, కనీసం రాజ్యసభలో బీసీలకు చోటు కల్పించకపోవడం దురదృష్టకరమని ఎంపీ ఆర్ కృష్ణయ్య అన్నారు. బీసీ విద్యార్థి సంఘం పగిళ్ల సతీష్ ఆధ్వర్యంలో విద్యార్థుల ఫీజు బకాయిలు చెల్లించాలని డిమాండ్ చే
MP Krishnaiah


హైదరాబాద్, 06 మార్చి (హి.స.)

బీసీలకు మంత్రివర్గంలో అన్యాయం జరిగిందని, కనీసం రాజ్యసభలో బీసీలకు చోటు కల్పించకపోవడం దురదృష్టకరమని ఎంపీ ఆర్ కృష్ణయ్య అన్నారు. బీసీ విద్యార్థి సంఘం పగిళ్ల సతీష్ ఆధ్వర్యంలో విద్యార్థుల ఫీజు బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ.. లక్షికాపుల్ లోని హైదరాబాద్ కలెక్టరేట్ ముందు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ.. పేద కులాలు ఉన్నత చదువులు చదవడం సీఎం రేవంత్ రెడ్డికి ఇష్టం లేదని ఆరోపించారు. కాంట్రాక్టర్లకు వేల కోట్లు బిల్లు చేస్తున్నారు కానీ.. రీయింబర్స్ మెంట్ విడుదల చేయడానికి మీనమేషాలు లెక్కిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇప్పటికైనా సీఎం రేవంత్ రెడ్డి స్పందించి విద్యార్థుల ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు విడుదల చేయాలని కృష్ణయ్య డిమాండ్ చేశారు. లేనిపక్షంలో తెలంగాణ ఉద్యమం తరహాలో మరో ఉద్యమానికి విద్యార్థి లోకం సిద్ధంగా ఉందని హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ అరుణ్ కుమార్, తెలంగాణ నిరుద్యోగ జేఏసీ చైర్మన్ నీల వెంకటేష్, బీసీ ఐక్యవేదిక అధ్యక్షుడు అనంతయ్య, పెద్ద ఎత్తున విద్యార్థులు పాల్గొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande