
సికింద్రాబాద్, 06 మార్చి (హి.స.)
సికింద్రాబాద్ ప్రాంతంలో మురుగు
పైప్లాన్ ఏర్పాటు పనుల నేపథ్యంలో శుక్రవారం నుంచి పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లింపు అమలు చేయనున్నట్లు పోలీసులు తెలిపారు. భారత్ పెట్రోలియం పంపు నుంచి రైల్ నిలయం సమీపంలోని రైల్వే బ్రిడ్జ్ అండర్పాస్ వరకు 450 మిల్లీమీటర్ల వ్యాసంతో మురుగు పైప్లాన్ వేసే పనులు చేపడుతున్నారు. ఈ పనుల కారణంగా పంజాగుట్ట, బేగంపేట్ ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలను సెయింట్ జాన్స్ రోటరీ జంక్షన్ వద్ద రైల్ నిలయం రోడ్ వైపు అనుమతించరు. ఆ వాహనాలను సంగీత్ జంక్షన్, అపోలో హాస్పిటల్ లేన్, చిలకలగూడ సర్కిల్ మార్గంగా మళ్లించి అలుగడ్డబావి, మెట్టుగూడ వైపు పంపిస్తారు.
అలాగే ఏఓసీ ప్రాంతం నుంచి వచ్చే వాహనాలను శెనోయ్ నర్సింగ్ హోమ్ జంక్షన్ వద్ద రైల్ నిలయం రోడ్లోకి అనుమతించకుండా అడ్డగుట్ట, తుకారాం గేట్, లాలాగూడ ఆర్ ఓబీ మార్గంగా మళ్లించి మెట్టుగూడ వైపు పంపిస్తారు. క్లాక్ టవర్, ఎల్డీడీ రోడ్ ప్రాంతాల నుంచి వచ్చే ట్రాఫిక్ను సంగీత్ జంక్షన్ వద్ద రైల్ నిలయం రోడ్ వైపు అనుమతించరు. ఆ వాహనాలను అపోలో హాస్పిటల్ లేన్, చిలకలగూడ సర్కిల్ మార్గంగా అలుగడ్డబావి, మెట్టుగూడ వైపు మళ్లిస్తారు. రెజిమెంటల్ బజార్, డీ-మార్ట్, ఎల్డీ రోడ్ ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలను అపోలో హాస్పిటల్ లేన్ వద్ద మళ్లించి చిలకలగూడ సర్కిల్, అలుగడ్డబావి మార్గంగా మెట్టుగూడకు పంపిస్తామని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. ప్రజలు ఈ మార్పులను గమనించి సహకరించాలని అధికారులు కోరారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు