
అమరావతి, 06 మార్చి (హి.స.)
వైసీపీ(Ycp) డిమాండ్ చేస్తున్న ప్రతిపక్ష హోదా అంశంపై సీఎం చంద్రబాబు(Cm Chandrababu) అసెంబ్లీ వేదికగా స్పందించారు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ(Ysr Congress Party)కి 11 సీట్లే ఇచ్చారని, ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తామనడం సరికాదని ఆయన వ్యాఖ్యానించారు. ప్రజలు ఓట్లు వేస్తేనే అధికార, ప్రతిపక్ష హోదాలు వస్తాయని చెప్పారు. ప్రస్తుతం తాము చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, అయినా సరే రాష్ట్రాన్ని గాడిలో పెడుతున్నామని తెలిపారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా సూపర్ సిక్స్ హామీల(Super Six Scemes)ను అమలు చేస్తున్నామని చెప్పారు. గతంలో పూర్తిగా విధ్వంస పాలనే జరిగిందని, ఇప్పుడు రాష్ట్రాన్ని వికాసం వైపు నడిపిస్తున్నామని చంద్రబాబు పేర్కొన్నారు.
రాబోయే రోజుల్లో ప్రతి ఇంటికి నల్లా నీళ్లు ఇస్తామన్నారు. కేంద్ర పథకాలకు గత ప్రభుత్వం సమాన గ్రాంట్లు ఇవ్వలేదని గుర్తు చేశారు. దీంతో చాలా పథకాలకు కేంద్రం నిధులు ఇవ్వలేకపోయిందని చంద్రబాబు తెలిపారు. గోదావరి పుష్కరాలకంటే పోలవరం సాకారమవుతోందన్నారు. పోలవరం నిర్మాణం క్వాలటీ విషయంలో రాజీపడకుండా పని చేస్తున్నామన్నారు. జగన్ హయాంలో ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టి మరీ అప్పులు తీసుకొచ్చారని తెలిపారు. అధిక వడ్డీలకు అప్పులు తెచ్చి ప్రభుత్వంపై భారం మోపారని చెప్పారు. అలాంటి రుణాలను రీ షెడ్యూల్ చేయించామని, మరికొన్నింటికి కూడా ప్రయత్నం చేస్తున్నామని చంద్రబాబు స్పష్టం చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV