యుద్ధం ఎఫెక్ట్: తెలుగు రాష్ట్రాల్లో పడిపోయిన కోడిగుడ్ల ధరలు.. రోజుకు రూ. 5 కోట్ల నష్టం!
అమరావతి, 06 మార్చి (హి.స.) అమెరికా-ఇజ్రాయెల్ vs ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు తెలుగు రాష్ట్రాల్లోని పౌల్ట్రీ రంగాన్ని (Poultry farm) తీవ్రంగా దెబ్బతీస్తున్నాయి. ఇరు దేశాల మధ్య కొనసాగుతున్న యుద్ధం కారణంగా అంతర్జాతీయ రవాణా వ్యవస్థ అస్తవ్యస్తమైంది.
Egg Price


అమరావతి, 06 మార్చి (హి.స.)

అమెరికా-ఇజ్రాయెల్ vs ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు తెలుగు రాష్ట్రాల్లోని పౌల్ట్రీ రంగాన్ని (Poultry farm) తీవ్రంగా దెబ్బతీస్తున్నాయి. ఇరు దేశాల మధ్య కొనసాగుతున్న యుద్ధం కారణంగా అంతర్జాతీయ రవాణా వ్యవస్థ అస్తవ్యస్తమైంది. ముఖ్యంగా మిడిల్ ఈస్ట్ (మధ్య ప్రాచ్యం) దేశాలకు జరిగే ఎగుమతులు పూర్తిగా నిలిచిపోవడంతో, దేశీయంగా కోడిగుడ్ల నిల్వలు (Egg reserves) భారీగా పేరుకుపోయాయి. దీని ప్రభావంతో గుడ్ల ధరలు దారుణంగా పడిపోయి, పౌల్ట్రీ రైతులు తీవ్ర నష్టాల్లో కూరుకుపోతున్నారు. ఈ సంక్షోభం కారణంగా పౌల్ట్రీ రంగానికి రోజుకు సుమారు రూ. 5 కోట్ల మేర నష్టం వాటిల్లుతున్నట్లు మార్కెట్ వర్గాల అంచనా వేస్తున్నాయి.

సాధారణంగా ఎగుమతులు సాఫీగా సాగే సమయంలో గుడ్డు ధర (Egg price) ఆశాజనకంగా ఉంటుంది. ప్రస్తుతం నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కమిటీ (NECC) ఒక్కో గుడ్డు ధరను రూ. 4.30గా నిర్ణయించినప్పటికీ, క్షేత్రస్థాయిలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. డిమాండ్ లేకపోవడంతో స్థానిక మార్కెట్లలో ఒక్కో గుడ్డు కేవలం రూ. 3.50 మాత్రమే పలుకుతోంది. కొన్ని ప్రాంతాల్లో ధర ఇంతకంటే తక్కువగా ఉండటంతో ఉత్పత్తి వ్యయం కూడా రాక రైతులు లబోదిబోమంటున్నారు.

యుద్ధ మేఘాలు త్వరగా తొలగిపోకపోతే, రానున్న రోజుల్లో ఎగుమతులు మరింతగా దెబ్బతిని ధరలు ఇంకా పడిపోయే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే వేసవి కాలం సమీపిస్తుండటం, గుడ్ల వినియోగం కాస్త తగ్గే అవకాశం ఉంది. దీంతో దేశవ్యాప్తంగా ఉన్న పౌల్ట్రీ యజమానుల్లో ఆందోళన పెరుగుతుంది. ప్రభుత్వం స్పందించి ఎగుమతులకు ప్రత్యామ్నాయ మార్గాలు చూపాలని, తమను ఆదుకోవాలని పౌల్ట్రీ రంగానికి చెందిన ప్రముఖులు కోరుతున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande