
ప్రకాశం జిల్ల, 07 మార్చి (హి.స.)నాగులుప్పలపాడు మండలం అమ్మనబ్రోలు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్గా పనిచేసిన నామన కృష్ణ మోహన్ రావు నివాసం, బంధువుల ఇళ్లపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. గత ఏడాది గిద్దలూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఇన్ఛార్జిగా బాధ్యతలు నిర్వహించారు. ఆ సమయంలో ఒక రైతు నుంచి రూ.35 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు కృష్ణ మోహన్. ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టినట్లు ఫిర్యాదులు రావడంతో కృష్ణ మోహన్ నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ