
అమరావతి, 07 మార్చి (హి.స.)విజయవాడ బస్టాండ్ సమీపంలోని ఓ హోటల్లో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా ఊహించని పరిణామం ఎదురైంది. ఓ వ్యక్తి పోలీసులపైనే తుపాకీతో కాల్పులుజరిపేందుకు ప్రయత్నించడం నగరంలో సంచలనంగా మారింది. విజయవాడ పోలీసులు, ఈగల్ అధికారులు బస్టాండ్ సమీపంలోని బాలాజీ హోటల్లో కార్డన్ సెర్చ్ (తనిఖీలు) నిర్వహిస్తున్నారు. తనిఖీ చేస్తున్న సమయంలో ఓ వ్యక్తి అకస్మాత్తుగా తన వద్ద ఉన్న తుపాకీతో అధికారులపై కాల్పులు జరిపేందుకు ప్రయత్నించాడు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ