కూటమి.ప్రభుత్వం వచ్చిన 20 నెలల్లోనే 9.వేలకు.పైగా నియామకాలు
అమరావతి, 07 మార్చి (హి.స.)ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం, : ‘కూటమి ప్రభుత్వం వచ్చిన 20 నెలల్లో దాదాపు 9 వేలకు పైగా నియామకాలు చేపట్టాం. ఇందులో 2,000 మంది వైద్యులు, 5,800 మంది పారా మెడికల్, 1200 మంది ఆశావర్కర్లు ఉన్నార’ని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత
కూటమి.ప్రభుత్వం వచ్చిన 20 నెలల్లోనే 9.వేలకు.పైగా నియామకాలు


అమరావతి, 07 మార్చి (హి.స.)ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం, : ‘కూటమి ప్రభుత్వం వచ్చిన 20 నెలల్లో దాదాపు 9 వేలకు పైగా నియామకాలు చేపట్టాం. ఇందులో 2,000 మంది వైద్యులు, 5,800 మంది పారా మెడికల్, 1200 మంది ఆశావర్కర్లు ఉన్నార’ని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. విజయవాడ డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వ విద్యాలయంలో అసాంక్రమిక వ్యాధుల నిరోధక చర్యల్లో భాగంగా ప్రాంతీయ, ఏరియా ఆస్పత్రుల్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఎన్సీడీ క్లినిక్స్లో 74 మంది వైద్యులకు శుక్రవారం నియామక పత్రాలను మంత్రి అందజేశారు. గత వైకాపా పాలనలో నిర్వీర్యమైన ఆయుష్ వైద్యానికి పూర్వ వైభవాన్ని తీసుకొచ్చే క్రమంలో 75 వైద్యుల పోస్టుల భర్తీతోపాటు పారా మెడికల్ ఇతర కేటగిరీల్లో 358 పోస్టులను భర్తీ చేస్తున్నామన్నారు. ఆహార భద్రత శాఖను బలోపేతం చేసే చర్యల్లో భాగంగా 78 ఫుడ్ సేఫ్టీ అధికారుల పోస్టులతో కలిపి 261 పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటున్నామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా క్యాన్సర్ ముందస్తు పరీక్షలకుగాను ఓరల్, బ్రెస్ట్, సర్వైకల్ పరీక్షలు జరుగుతున్నాయన్నారు. సెకండరీ హెల్త్ డైరెక్టర్ చక్రధర బాబు మాట్లాడుతూ కొత్తగా నియమితులైన వైద్యులు పీహెచ్సీలు,

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande