
పోలవరం, 07 మార్చి (హి.స.): ఏలేరు జలాశయం పరివాహక ప్రాంతంలోనే పెద్ద పులి సంచరిస్తోంది. పోలవరం, కాకినాడ జిల్లా సరిహద్దు ప్రాంతాల్లో పులి జాడలను గుర్తించారు. అడ్డతీగల మండలం గొట్టువానిపాలెం, ఏలేశ్వరం మండలం మర్రివీడు పరిసర ప్రాంతాల్లో పెద్ద పులి సంచరిస్తున్నట్లు అటవీ శాఖ అధికారులు తెలిపారు. అడ్డతీగల, ఏలేశ్వరం, రాజవొమ్మంగి మండలాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. రేడియో కాలర్ ద్వారా పులి జాడను గుర్తించారు. భౌగోళికంగా ప్రతికూల ప్రాంతం కావడంతో పులిని బంధించేందుకు అధికారులు ఇబ్బంది పడుతున్నారు. బోనులు సిద్ధం చేసినా దరిదాపుల్లోకి పులి రావడం లేదు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ