ఏపి వ్యాప్తంగా పోలీసులు.నిర్బంధ తనిఖీలు
అమరావతి, 07 మార్చి (హి.స.): ఏపీ వ్యాప్తంగా పోలీసులు నిర్బంధ తనిఖీలు చేపట్టారు. పలు జిల్లాల్లో వందకు పైగా బృందాలతో సోదాలు చేపట్టారు. సరైన ధ్రువపత్రాలు లేని వాహనాలను సీజ్ చేస్తున్నారు. నివాస ధ్రువీకరణ పత్రాలనూ తనిఖీ చేస్తున్నారు. అనుమానిత వ్యక్తులు,
ఏపి వ్యాప్తంగా పోలీసులు.నిర్బంధ తనిఖీలు


అమరావతి, 07 మార్చి (హి.స.): ఏపీ వ్యాప్తంగా పోలీసులు నిర్బంధ తనిఖీలు చేపట్టారు. పలు జిల్లాల్లో వందకు పైగా బృందాలతో సోదాలు చేపట్టారు. సరైన ధ్రువపత్రాలు లేని వాహనాలను సీజ్ చేస్తున్నారు. నివాస ధ్రువీకరణ పత్రాలనూ తనిఖీ చేస్తున్నారు. అనుమానిత వ్యక్తులు, గంజాయి విక్రయాలపై దృష్టి సారించారు. ఆపరేషన్ ‘వజ్ర ప్రహార్’లో భాగంగా ఈ ప్రత్యేక డ్రైవ్ చేపట్టారు.

గంజాయి రహిత ఆంధ్రప్రదేశ్ సాధనే ప్రధాన లక్ష్యమని ఈగల్ ఐజీ రవికృష్ణ తెలిపారు. ‘‘రాష్ట్రవ్యాప్తంగా 100 చోట్ల ఆపరేషన్ వజ్రప్రహార్ కార్డెన్ సెర్చ్ జరుగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా గంజాయి సరఫరా జరిగే 849 హాట్ స్పాట్స్ గుర్తించాం. వీటికి అడ్డుకట్ట వేసేందుకు తనిఖీలు కొనసాగుతాయి’’ అని ఐజీ చెప్పారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande