
అమరావతి, 07 మార్చి (హి.స.)
ఏలేశ్వరం, ద్విచక్రవాహనం అదుపు తప్పి కాలువలో దూసుకువెళ్లిపోవడంతో ఒకరు గల్లంతైన ఘటన శుక్రవారం సాయంత్రం ఏలేశ్వరంలో జరిగింది. ఈ ప్రమాదంలో ద్విచక్రవాహనం నడుపుతున్న మరోవ్యక్తికి గాయాలయ్యాయి. వివరాలివి.. ఏలేశ్వరం క్వారీ పేటకు చెందిన బంగర్తి విజయ్, గిడుతూరి లోవరాజు క్వారీ పనులకు వెళ్లి తిరిగి ద్విచక్రవాహనంపై ఇంటికి బయలుదేరారు. ఏలేశ్వరం-సి.రాయవరం మధ్య మలుపు వద్దకు వచ్చేసరికి అదుపు తప్పి ఏలేరు ఎడమ కాలువలో పడిపోయారు. ఈ ప్రమాదంలో లోవరాజు (41) కాలువలో గల్లంతయ్యారు. విజయ్కు గాయాలవ్వగా స్థానిక ప్రభుత్వాసుపత్రిలో ప్రాథమిక చికిత్స అందించారు. ఈ ఘటనపై ఏలేశ్వరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు రాయుడు చిన్న తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ