BR నాయుడు వీడియోలో తప్పు లేనప్పుడు,కేక్ కట్ చేస్తే తప్పేంటి?
తిరుమల, 07 మార్చి (హి.స.)తిరుమల శ్రీవారి సన్నిధిలో పుట్టిన రోజు వేడుకలు జరుపుకున్న దివ్వెల మాధురి, తనూజపై చట్ట పరమైన చర్యలకు టీటీడీ పాలక మండలి సిద్ధమైంది. ఈ మేరకు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ఆదేశాలు జారీ చేశారని తెలుస్తోంది. ఈ కేసులో మాధురి, తనూజ ఇ
duvvada-srinivas-question-on-ttd-br-naidu-video-controversy-madh


తిరుమల, 07 మార్చి (హి.స.)తిరుమల శ్రీవారి సన్నిధిలో పుట్టిన రోజు వేడుకలు జరుపుకున్న దివ్వెల మాధురి, తనూజపై చట్ట పరమైన చర్యలకు టీటీడీ పాలక మండలి సిద్ధమైంది. ఈ మేరకు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ఆదేశాలు జారీ చేశారని తెలుస్తోంది. ఈ కేసులో మాధురి, తనూజ ఇద్దరూ అరెస్టు అవుతారని సోషల్ మీడియాలో ప్రచారం కూడా జోరు అందుకుంది. ఈ నేపథ్యంలోనే తిరుమలలో తనూజ పుట్టిన రోజు వేడుకలు జరుపుకున్న వివాదంపైన దువ్వాడ శ్రీనివాస్ సంచలన వీడియో విడుదల చేశారు. తమను కావాలనే ఈ కేసులో ఇరికించారని ఫైర్ అయ్యారు. బీఆర్ నాయుడు వీడియో క్లిప్పింగ్స్ లో ఎలాంటి తప్పు లేనప్పుడు, కేక్ కట్ చేస్తే తప్పేంటి ? అంటూ నిలదీశారు దువ్వాడ శ్రీనివాస్.

అసలు తిరుమల కొండపైన కేక్ కట్ చేయకూడదని రూల్ తమకు తెలియదని, తెలిసి ఉంటే అసలు ఆ పని చేసే వాళ్ళం కాదంటూ క్లారిటీ ఇచ్చారు దువ్వాడ శ్రీనివాస్. తిరుమల కొండపై తాము కోసిన కేక్, ప్యూర్ వెజ్ అని వెల్లడించారు. అందులో ఎలాంటి ఎగ్ కలవలేదని, ఆధారాలు చూపించారు దువ్వాడ. ఆ కేక్ కొనుగోలు చేసిన అడ్రస్ కూడా చెప్పారు. దీనిపై విచారణ చేస్తే అసలు నిజం బయటపడుతుందని వెల్లడించారు. రూల్ తెలియకుండా కేక్ కట్ చేసినందుకు తిరుమల శ్రీవారికి క్షమాపణలు చెబుతున్నట్లు వీడియోలో స్పష్టం చేశారు దువ్వాడ శ్రీనివాస్.

అయితే రెండు తెలుగు రాష్ట్రాలలో బీఆర్ నాయుడు వీడియోల గురించి చర్చ జరుగుతున్న నేపథ్యంలో, డైవర్ట్ పాలిటిక్స్ లో భాగంగా తమ ఇష్యును హైలెట్ చేస్తున్నారని ఫైరయ్యారు. కొన్ని మీడియా సంస్థలు ఆ వివాదాన్ని వదిలేసి, మేం కట్ చేసిన కేక్ గురించి మాత్రమే వార్తలు వేస్తున్నారని సీరియస్ అయ్యారు. అయినప్పటికీ ఈ కేసులో న్యాయ పోరాటం చేస్తామని ప్రకటించారు. బీఆర్ నాయుడు పెట్టే కేసులకు తాము భయపడబోమని, తమకు తిరుమల శ్రీవారు అండగా ఉన్నారని పేర్కొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande