
రాయపూర్ 01 ఏప్రిల్ (హి.స.)
ఛత్తీస్గఢ్లో బీజాపూర్ జిల్లాలో మంగళవారం 25 మంది మావోయిస్టులు బస్తర్ ఐజీ సుందర్ రాజ్ ఎదుట లొంగిపోయారు. వీరంతా దండకాకరణ్య స్పెషల్ జోనల్ కమిటీ సభ్యులు. లొంగిపోయిన వారిలో 12మంది మహిళలుండగా, వీరందరిపై కలిపి మొత్తం రూ.1.47 కోట్ల రివార్డు ఉంది. వీరి నుంచి 93 తుపాకులు, రూ.2.90కోట్ల నగదు, 7.20కిలోల బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా బస్తర్ ఐజీ సుందర్ రాజ్ మాట్లాడుతూ.. వీరి లొంగుబాటుతో దండకారణ్య కమిటీ కూడా పూర్తిగా తుడిచిపెట్టుకు పోయినట్టేనన్నారు. కేంద్రం విధించిన మార్చి 31 నాటికి దేశం మావోయిస్టులు లేని ప్రాంతంగా మారిందన్నారు.
సంతోషలక్ష్మి
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi