
హైదరాబాద్, 13 ఏప్రిల్ (హి.స.)
IPL 2026 సీజన్లో భాగంగా నేడుఉప్పల్ స్టేడియంలో సన్రైజర్స్ హైదరాబాద్ (SRH), రాజస్థాన్ రాయల్స్ (RR) మధ్య కీలకమైన మ్యాచ్ జరగనుంది. ఈ సీజన్లో రాజస్థాన్ రాయల్స్ అజేయంగా కొనసాగుతూ అద్భుతమైన ఫామ్లో ఉండగా, సన్రైజర్స్ హైదరాబాద్ తమ సొంత మైదానంలో గెలుపు రుచి చూడాలని ఉవ్విళ్లూరుతోంది. రాజస్థాన్ రాయల్స్ తరపున 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్లో అత్యంత ధాటిగా ఆడుతూ ప్రత్యర్థి బౌలర్లకు సవాలుగా మారారు. పవర్ప్లేలో అతడి బ్యాటింగ్ RR విజయాల్లో కీలక పాత్ర పోషిస్తోంది. మరోవైపు సన్రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్లో ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, హెన్రిచ్ క్లాసెన్ వంటి భారీ హిట్టర్లు ఉండటం ఈ మ్యాచ్ను హోరాహోరీగా మార్చనుంది.
హైదరాబాద్ పిచ్ సాధారణంగా బ్యాటింగ్కు అనుకూలంగా ఉండటంతో, నేటి మ్యాచ్లో భారీ స్కోర్లు నమోదు అయ్యే అవకాశం ఉంది. సొంతగడ్డపై SRHకి ఉన్న అడ్వాంటేజ్ ఒకవైపు, RR అజేయమైన ఫామ్ మరోవైపు ఉండటంతో, ఈ మ్యాచ్ ఎంతో ఉత్కంఠభరితంగా సాగనుంది. ఇప్పటికే 3 మ్యాచుల్లో ఓడిన సన్ రైజర్స్ జట్టు ఎలాగైనా గెలవాలనే చూస్తుండగా.. అది నెరవేరుతుందా లేదా అనేది సాయంత్రం తేలనుంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..