మక్కా ప్రవేశంపై సౌదీ అరేబియా ఆంక్షలు.. వారికి పర్మిట్ తప్పనిసరి
మక్కా ప్రవేశంపై ఆంక్షలు విధించిన సౌదీ అరేబియా
Makka Yatra


సౌదీ అరేబియా, 13 ఏప్రిల్ (హి.స.)

హజ్ సీజన్ దృష్ట్యా సౌదీ అరేబియా

(Saudi Arabia) ప్రభుత్వం కొత్త నిబంధనలను అమల్లోకి తీసుకొచ్చింది. ఏప్రిల్ 13 నుంచి అధికారిక పర్మిట్లు లేని విదేశీయులు, నివాసితులు మక్కా (Makkah) నగరంలోకి ప్రవేశించకుండా నిషేధం విధించింది. వారంతా తప్పనిసరిగా ఎంట్రీ పర్మిట్లు కలిగి ఉండాలని పేర్కొంది. అనుమతి పత్రాలు లేని వారిని మక్కాలోకి అనుమతించబోమని అధికారులు స్పష్టం చేశారు. పవిత్ర స్థలాల్లో పని చేసే వర్క్ పర్మిట్ ఉన్నవారు, మక్కాలో జారీ చేసిన రెసిడెన్సీ ఐడీ (Igama) ఉన్నవారు, చెల్లుబాటు అయ్యే హజ్ పర్మిట్ ఉన్నవారికి మాత్రమే మక్కాలోకి ప్రవేశం కల్పిస్తారు. నిబంధనలను ఉల్లంఘించే వారిని వెనక్కి పంపేందుకు సరిహద్దుల వద్ద తనిఖీ కేంద్రాలను ఏర్పాటు చేశారు.

మరోవైపు ఉమ్రా వీసాలపై వచ్చిన విదేశీ యాత్రికులు ఏప్రిల్ 18 లోపు దేశం విడిచి వెళ్లాలని గడువు విధించారు. అదేవిధంగా ఏప్రిల్ 18 నుంచి మే 31 వరకు నుసుక్ (Nusuk) ప్లాట్ఫారమ్ ద్వారా పౌరులు, నివాసితులు, జీసీసీ (GCC) దేశాల వారందరికీ ఉమ్రా పర్మిట్ల జారీని నిలిపివేయనున్నారు. ఏప్రిల్ 18 తర్వాత కేవలం హజ్ వీసా ఉన్న వారిని మాత్రమే మక్కాలోకి అనుమతిస్తారు. హజ్ యాత్రికుల రద్దీని నియంత్రించడానికి, భద్రతను పర్యవేక్షించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు సౌదీ ప్రెస్ ఏజెన్సీ (SPA) తెలిపింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande