
అమెరికా, 12 ఏప్రిల్ (హి.స.)
అమెరికా వర్సెస్ ఇరాన్ మధ్య చర్చలు విఫలమయ్యాయి. దీంతో మళ్లీ యుద్ధం ప్రారంభమయ్యే పరిస్థితులు నెలకొన్నాయి. ఇరాన్ వర్సెస్ అమెరికా మధ్య చర్చలు ఇంకా కొలిక్కి రాలేదని తాజాగా యూఎస్ వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ అధికారిక ప్రకటన చేశారు. పాకిస్తాన్ లో చర్చల అనంతరం ఈ మేరకు అధికారిక ప్రకటన చేశారు. తమ షరతులను ఇరాన్ అంగీకరించడం లేదని వెల్లడించారు.
అమెరికా వర్సెస్ ఇరాన్ మధ్య చర్చలు విఫలం కావడానికి న్యూక్లియర్ డీల్ ప్రధాన కారణమని చెబుతున్నారు విశ్లేషకులు. శుద్ధి చేసిన యురేనియంను తమకు అప్పగించాలని, ఫ్యూచర్ లో దానిపై పరిశోధనలు చేయకూడదని అమెరికా సూచనలు చేసిందని తెలుస్తోంది. అయితే దీనికి ఇరాన్ అస్సలు తగ్గలేదని చెబుతున్నారు. ముఖ్యంగా హార్మూజ్ జలసంధిని పూర్తిగా తెరిచేందుకు ఇరాన్ నో చెప్పినట్లు తెలుస్తోంది. లెబనాన్ పై ఇజ్రాయెల్ దాడులు ఆపాలని ఇరాన్ కూడా కోరిందట. అయితే దీనిపై అమెరికా మాత్రం స్పష్టమైన హామీ ఇవ్వలేదని సమాచారం. దీంతో చర్చలు అర్ధాంతరంగా ముగిశాయి. ఇక ఈ చర్చలు ముగిసిన నేపథ్యంలో మళ్లీ యుద్ధం కొనసాగుతుందని అంచనా వేస్తున్నారు విశ్లేషకులు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV