ఇజ్రాయెల్ మెరుపు దాడి: నిమిషం వ్యవధిలో 180 మంది ఉగ్రవాదులు ఖతం!
మెరుపు దాడి చేసిన ఇజ్రాయిల్...180 మంది ఉగ్రవాదులు హతం
israels-lightning-strike-on-hezbollah-180-terrorists-killed-in-a-minute-5


ఢిల్లీ, 11 ఏప్రిల్ (హి.స.)పశ్చిమాసియాలో యుద్ధం ముగిసిందన్న వార్తల నడుమ, ఇజ్రాయెల్ సైన్యం (IDF) లెబనాన్లోని హెజ్బొల్లా స్థావరాలపై అత్యంత శక్తివంతమైన దాడులతో విరుచుకుపడింది. కేవలం ఒక నిమిషం వ్యవధిలోనే సుమారు 180 మంది హెజ్బొల్లా టెర్రరిస్టులను మట్టుబెట్టినట్లు ఐడీఎఫ్ అధికారికంగా ప్రకటించింది. పక్కా ఇంటెలిజెన్స్ సమాచారం ఆధారంగా మూడు ప్రధాన ప్రాంతాల్లోని వందకు పైగా లక్ష్యాలపై ఒకేసారి వైమానిక దాడులు నిర్వహించినట్లు వెల్లడించింది.

బీరుట్, బెక్కా లోయ, దక్షిణ లెబనాన్ ప్రాంతాల్లో హెజ్బొల్లా ఉగ్రవాదులు వినియోగించే ప్రధాన కమాండ్ సెంటర్లు, కీలక మిలిటరీ నిర్మాణాలను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు జరిగాయి. హై క్వాలిటీ ఇంటెలిజెన్స్ సహాయంతో ఈ ఆపరేషన్ నిర్వహించామని, దీనివల్ల శత్రువుల కమ్యూనికేషన్ వ్యవస్థ దెబ్బతిన్నదని ఐడీఎఫ్ తెలిపింది. కాగా, ఈ దాడుల సమయంలో సామాన్య పౌరులకు ఎటువంటి హాని కలగకుండా గరిష్ట జాగ్రత్తలు తీసుకున్నట్లు ఇజ్రాయెల్ స్పష్టం చేసింది. హెజ్బొల్లా ఉగ్రవాదుల బెదిరింపులను అణచివేసేందుకు ఈ వ్యూహాత్మక దాడులు అత్యవసరమని ఐడీఎఫ్ పేర్కొంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande