
ముంబై, 17 ఏప్రిల్ (హి.స.)బంగారం రేట్లలో పెరుగుదల నమోదవుతోంది. సోమవారం నుంచి ధరలు పెరుగుతూనే ఉన్నాయి. అంతర్జాతీయ పరిణామాల క్రమంలో గోల్డ్ రేట్లు హైక్ అవుతున్నాయి. దీంతో కొనుగోలుదారులకు షాక్ తగులుతోంది. గత వారంలో గోల్డ్, సిల్వర్ రేట్లు తగ్గడంతో కొనుగోలు చేసేవారు ఊరట చెందారు. కానీ ఈ వారంలో ధరలు పెరుగుతుండటంతో షాపులకు వెళ్లేందుకు కూడా వెనకడుగు వేస్తున్నారు. శుక్రవారం దేశంలోని వివిధ నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయనేది ఒకసారి చూద్దాం.
హైదరాబాద్లో 10 గ్రామలు 24 క్యారెట్ల ఫ్యూర్ గోల్డ్ రేటు రూ.1,55,580 వద్ద కొనసాగుతోండగా.. గురువారం రూ.1,55,570 వద్ద స్ధిరపడింది. ఇక 22 క్యారెట్ల రేటు రూ.1,42,610 వద్ద ఉండగా.. నిన్న రూ.1,42,600గా ఉంది. ఇక విజయవాడ, విశాఖపట్నంలో 24 క్యారెట్ల స్వచ్చమైన బంగారం ధర రూ.1,55,580 వద్ద కొనసాగుతోండగా.. 22 క్యారెట్ల ధర రూ.1,42,610 వద్ద ట్రేడవుతోంది.
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV