
ముంబై, 16 ఏప్రిల్ (హి.స.)
దేశీయ స్టాక్ మార్కెట్లు (DomesticStock Markets) నేడు లాభాల బాటలో పయనిస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి అందుతున్న సానుకూల సంకేతాలతో ఇన్వెస్టర్లు కొనుగోళ్ల వైపు మొగ్గు చూపడంతో సూచీలు ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి. ఇవాళ ఉదయం ట్రేడింగ్ ప్రారంభమైన కొద్దిసేపటికే, అంటే ఉదయం 9.45 గంటల సమయానికి సెన్సెక్స్ (Sensex) 280 పాయింట్లు పెరిగి లాభాల్లో కొనసాగుతోంది. ఇక నిఫ్టీ (NIFTY) 95 పాయింట్ల వృద్ధిని నమోదు చేసి కీలక స్థాయిల వద్ద ట్రేడ్ అవుతోంది. ప్రధానంగా బ్యాంకింగ్, ఐటీ, మెటల్ రంగాల షేర్లలో కొనుగోళ్ల మద్దతు లభిస్తుండటంతో మార్కెట్లు కళకళలాడుతున్నాయి. గడిచిన కొన్ని సెషన్లుగా ఒడిదుడుకులకు లోనైన సూచీలు, నేడు రికవరీ బాట పట్టడం ఇన్వెస్టర్లలో నమ్మకాన్ని నింపింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు