
ముంబై, 15 ఏప్రిల్ (హి.స.)భారతీయులకు బంగారం అంటే కేవలం ఒక మెటల్ కాదు.. స్పెషల్ సెంటిమెంట్. పెళ్లి, పండగ వేడుక ఏదైన బంగారం కొనాల్సిందే. అంతేకాకుండా కష్టసమయాల్లో ఆదుకునే ఆర్థిక భరోసా కూడా. అయితే గత కొంత కాలంగా పెరుగుతున్న ధరలతో సామాన్యుడు బంగారం కొనలేని పరిస్థితులు నెలకొంటున్నాయి. గతేడాది మొదట్లో రూ.లక్ష లోపు ఉన్న బంగారం ఇప్పుడు లక్షన్నర దాటింది. అంతర్జాతీయ పరిస్థితులే దీనికి కారణం అని చెప్పొచ్చు. ఇక బుధవారం కూడా బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్లో ఈరోజు 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.10 పెరిగి రూ.1,53,940 కి చేరుకుంది. ఇక అదేవిధంగా సామాన్యులు ఆభరణాల తయారీ కోసం కొనుగోలు చేసే 22 క్యారెట్ల బంగారం ధర కూడా 10 గ్రాములపై రూ.10 పెరగడంతో ప్రస్తుతం రూ.1,41,110 కి చేరుకుంది.
ఇక విజయవాడ, వైజాగ్ నగరాల్లోనూ హైదరాబాద్లో ఉన్న ధరలే కొనసాగుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి రూ.1,54,090గా ఉంది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,41,260 వద్ద కొనసాగుతుంది. ఇక చెన్నైలో ఇతర నగరాల కంటే బంగారం ధరలు స్వల్పంగా ఎక్కువగా ఉన్నాయి. చెన్నైలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర దాదాపు రూ.1,55,140 వద్ద ట్రేడ్ అవుతోంది. 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ.1,42,210గా ఉంది.
బంగారం బాటలోనే వెండి ధరలు కూడా స్వల్పంగా పెరిగాయి. కేజీ వెండి ధర రూ.100 పెరగడంతో హైదరాబాద్, విజయవాడ, వైజాగ్ మార్కెట్లో కిలో వెండి ధర రూ.2,65,100 కి చేరింది
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV