లోక్సభ, రాజ్యసభ నిరవధిక వాయిదా.. ముగిసిన బడ్జెట్ సమావేశాలు
లోక్సభ, రాజ్యసభ నిరవధిక వాయిదా.. ముగిసిన బడ్జెట్ సమావేశాలు
లోక్సభ, రాజ్యసభ నిరవధిక వాయిదా.. ముగిసిన బడ్జెట్ సమావేశాలు


న్యూఢిల్లీ, 18 ఏప్రిల్ (హి.స.)

పార్లమెంట్(Parliament) బడ్జెట్ సమావేశాలు ముగిశాయి. లోక్సభ ఇవాళ నిరవధిక వాయిదా పడింది. దీంతో జనవరిలో మొదలైన బడ్జెట్ సమావేశాలు ముగిసిపోయాయి. ఇవాళ ఉదయం 11 గంటలకు సభ ప్రారంభం కాగానే, స్పీకర్ ఓం బిర్లా సమావేశ వివరాలను వెల్లడించారు. ఆ తర్వాత ఆయన సభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు తెలిపారు. ఏప్రిల్ 16 నుంచి మూడు రోజుల పాటు ప్రత్యేక సమావేశాలు నిర్వహించిన విషయం తెలిసిందే. శుక్రవారం లోక్సభలో 131వ రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోయింది. మూడవ వంతు మెజారిటీ రాకపోవడంతో.. మహిళా రిజర్వేషన్ బిల్లు కూడా ఓటమిపాలైంది. డీలిమిటేషన్ ప్రక్రియ ద్వారా లోక్సభ సీట్లను పెంచే ప్రక్రియ కూడా స్తంభించిపోయింది. రాజ్యసభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు చైర్మెన్ సీపీ రాధాకృష్ణణ్ తెలిపారు. రాజ్యసభ సుమారు 157 గంటల 40 నిమిషాల పాటు సాగినట్లు చెప్పారు. సుమారు 110 శాతం ప్రొడక్టివిట్ సాధించినట్లు తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande