
హైదరాబాద్, 21 ఏప్రిల్ (హి.స.)
ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ (Amazon) భారీ రీఫండ్ మోసానికి వ్యతిరేకంగా న్యాయపోరాటం చేయాలని డిసైడ్ అయింది. ఖరీదైన లాప్టాప్లు, గ్రాఫిక్ కార్డ్స్ (GPUs) కొనుగోలు చేసి, వాటికి నకిలీ రీఫండ్లు పొందుతున్న ఓ ముఠాపై అమెజాన్ కోర్టులో దావా వేసింది. ఈ స్కామ్ కారణంగా కంపెనీ మిలియన్ల డాలర్లు నష్టపోయినట్లుగా వెల్లడించింది.
కొందరు మోసగాళ్లు అమెజాన్లో ఖరీదైన ఎలక్ట్రానిక్ వస్తువులను ఆర్డర్ చేసి, అవి అందిన తర్వాత బాక్స్ ఖాళీగా ఉందని, వస్తువు పాడైపోయిందని చెప్పి నకిలీ క్లెయిమ్స్ ద్వారా డబ్బులు వెనక్కి తీసుకున్నారు. ఈ తరహా రీఫండ్ స్కామ్ల వల్ల అమెజాన్ సుమారు మిలియన్ల డాలర్లను నష్టపోయింది. ఈ మోసాన్ని కనిపెట్టడానికి, దర్యాప్తు చేయడానికి అమెజాన్ ఇప్పటికే 75,000 డాలర్లు అంటే భారత కరెన్సీలో సుమారు రూ.62 లక్షలు కంటే ఎక్కువ ఖర్చు చేసినట్లు కోర్టుకు తెలిపింది. ఈ మేరకు దర్యాప్తు కోసం తాము వెచ్చించిన ఈ మొత్తాన్ని తమకు తిరిగి చెల్లించాలని (Legal & Investigation costs) అమెజాన్ కోర్టును కోరింది. ఇలాంటి మోసపూరిత క్లెయిమ్లను అరికట్టేందుకు సెక్యూరిటీ అల్గారిథమ్స్్స్ను మరింత పటిష్టం చేస్తున్నట్లుగా అమెజాన్ ప్రతినిధులు తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు