
ముంబై, 02 ఏప్రిల్ (హి.స.)గత కొన్ని రోజులుగా భారీగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలకు ఒక్కసారిగా రెక్కలు వచ్చాయి. కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభంలోనే బంగారం, వెండి ధరలు మళ్లీ పుంజుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో అమెరికన్ డాలర్ విలువ తగ్గడం వల్ల పెట్టుబడిదారులు బంగారం వైపు మొగ్గు చూపడంతో బంగారం ధరల్లో ఒక్కసారిగా భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. డాలర్ తగ్గితే సాధారణంగా బంగారం ధరలు పెరుగుతాయి. ఈ క్రమంలో బుధవారం ఒక్కరోజే తులం బంగారంపై ఏకంగా రూ.3వేలకుపైగా పెరిగింది.
ఈ భారీ హెచ్చుతగ్గుల తర్వాత ప్రస్తుతం భారత్ మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు సుమారు రూ.1,52,960 కు చేరుకుంది. ఇక 22 క్యారెట్ల బంగారం ధర చూసుకుంటే తులం 1,40,200 వద్ద స్థిరపడింది. ఇక 18 క్యారెట్ల బంగారం ధర రూ. 1,14,710 కొనసాగుతోంది. హైదరాబాద్ సహా దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా
గురువారం ఉదయం 6గంటలకు హైదరాబాద్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,52,960గా ఉంది. నిన్న ఈ ధర రూ.1,52,950 వద్ద కొనసాగుతోంది. అటు 22 క్యారెట్ల ధర ఇవాళ రూ.1,40,210 వద్ద ఉండగా.. నిన్న రూ.1,40,200 వద్ద ట్రేడవుతోంది.
ఇక ఆంద్రప్రదేశ్లోని విజయవాడ, విశాఖపట్నంలో 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,52,960 వద్ద ట్రేడవుతోండగా.. నిన్న రూ.1,52,950గా ఉంది. ఇక 22 క్యారెట్ల రేటు రూ.1,40,210 వద్ద కొనసాగుతోంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV