98.45 శాతం రూ. 2 వేల నోట్లు వెనక్కి.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
రెండువేల రూపాయల నోట్లను తిరిగి బ్యాంకుల్లో చేర్చాలని అన్న ఆర్బీఐ
RBI


హైదరాబాద్, 02 ఏప్రిల్ (హి.స.)

చలామణీలో ఉన్న 98.45 శాతం రూ.2 వేల నోట్లు తిరిగి బ్యాంకులకు చేరాయని భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) ఓ ప్రకటనలో వెల్లడించింది. ఈ ఏడాది మార్చి 31 నాటికి ఇంకా రూ. 5,501 కోట్ల విలువ పెద్ద నోట్లు ప్రజల వద్దే ఉన్నాయని తెలిపింది. 2023, మే 19న రూ. 2,000 నోట్ల ఉపసంహరణ ప్రకటన వెలువడే సమయానికి వ్యవస్థలో మొత్తం రూ.3.56 లక్షల కోట్ల విలువైన నోట్లు ఉన్నాయి. ఈ నోట్లను ఆర్బీఐ చలామణి నుంచి ఉపసంహరించుకున్నప్పటికీ అవి చట్టబద్ధంగా చెల్లుబాటు అవుతాయి. ఎవరి వద్దనైనా ఆ నోట్లు ఉంటే ఆర్బీఐ కార్యాలయాల్లో డిపాజిట్ చేయవచ్చు లేదా మార్చుకోవచ్చు అదేవిధంగా దేశవ్యాప్తంగా ఉన్న పోస్టాఫీసుల నుంచి కూడా ప్రజలు తమ వద్ద రూ. 2,000 నోట్లను ఆర్బీఐకి పోస్టల్ రూపంలో పంపి, తమ అకౌంట్లలో క్రెడిట్ చేయించుకొనే వీలు కల్పించింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande