
కర్నూలు, 20 ఏప్రిల్ (హి.స.)
పండ్ల రాజు రుచిలో అద్భుతం అనే విషయంలో ఎటువంటి సందేహం లేదు. చాలా మంది రుచిగా ఉన్నాయి కదా అని గంపలు గంపలు తినేస్తూ ఉంటారు. కానీ ఈ తప్పు చేయకూడదు. ఈ పండులో షుగర్ లెవల్స్ ఇంకా కేలరీలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఈ పండ్లు ఎక్కువగా తినడం వల్ల రక్తంలో షుగర్ లెవల్స్ పెరుగుతాయి. దీనివల్ల బరువు పెరిగే ప్రమాదం ఉంది. ప్రకృతి ప్రసాదించిన ఈ అద్భుతమైన పండును సరైన పద్ధతిలో తీసుకోవడం వల్ల ఎటువంటి ఆరోగ్య సమస్యలు రాకుండా ఆస్వాదించవచ్చు.
వేసవి కాలం వచ్చిందంటే చాలు పిల్లల నుండి పెద్దల వరకు అందరూ ఎదురుచూసేది పండ్ల రాజు మామిడి పండు కోసమే. కేవలం ఈ సీజన్లో మాత్రమే లభించే ఈ పండును ఆస్వాదించడానికి ప్రతి ఒక్కరూ ఇష్టపడతారు. అయితే, రుచిగా ఉన్నాయి కదా అని మామిడి పండ్లను తినే క్రమంలో మనం చేసే కొన్ని చిన్న చిన్న పొరపాట్లు తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీస్తాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. క
చాలా మంది మామిడి పండు రుచికి ముగ్ధులై పరిమితికి మించి తినేస్తుంటారు. దీనివల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు అకస్మాత్తుగా పెరిగి బరువు పెరగడం లేదా విరేచనాలు వంటి సమస్యలు రావచ్చు. అందుకే రోజుకు ఒక పండు కంటే ఎక్కువగా తినకపోవడమే మంచిది. అలాగే మామిడి పండును ఒంటరిగా కాకుండా బాదం పప్పులు, పెరుగు లేదా పన్నీర్ వంటి ప్రోటీన్ కలిగిన ఆహారంతో కలిపి తీసుకోవాలి.
భోజనం చేసిన వెంటనే మామిడి పండును డెజర్ట్ లా తీసుకోవడం చాలామందికి అలవాటు. ముఖ్యంగా బిర్యానీ వంటి హెవీ ఫుడ్ తిన్న తర్వాత మామిడి పండు తింటే జీర్ణక్రియపై విపరీతమైన భారం పడి అజీర్తి, గ్యాస్ సమస్యలు తలెత్తుతాయి. భోజనానికి, పండు తినడానికి మధ్య కనీసం రెండు గంటల సమయం ఉండాలి. అలాగే మామిడిని జ్యూస్ రూపంలో కాకుండా పండులాగే నమిలి తినాలి.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV