
న్యూఢిల్లీ, 21 ఏప్రిల్ (హి.స.)
దేశ అంతర్గత భద్రతను మరింత
పటిష్టం చేసే దిశగా భారత్ మరో కీలక అడుగు వేసింది. రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (DRDO) రూపొందించిన అత్యాధునిక శాటిలైట్ ఇమేజింగ్ సిస్టమ్ 'ప్రజ్ఞ' (Prajna)ను కేంద్ర హోంశాఖకు అప్పగించారు. ఢిల్లీలోని కర్తవ్య భవన్లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో రక్షణ శాఖ కార్యదర్శి ఈ వ్యవస్థను హోం శఖ కార్యదర్శికి అధికారికంగా అందజేశారు.
డీఆర్డీవోకు చెందిన 'ప్రజ్ఞ' సిస్టమ్ సెంటర్ ఫర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ రోబోటిక్స్ (CAIR) ల్యాబ్ అభివృద్ధి చేసింది. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (Al) ఆధారంగా పనిచేస్తుంది. ఉపగ్రహాల ద్వారా అందే చిత్రాలను అత్యంత వేగంగా విశ్లేషించి, రియల్ టైమ్ డేటాను హోంశాఖకు అప్పగిస్తుంది. క్లిష్ట పరిస్థితుల్లో, చోటుచేసుకున్నప్పుడు సరిహద్దుల్లో ఉద్రిక్తతలు ఈ వ్యవస్థ అందించే సమాచారం భద్రతా దళాలకు మరింత కీలకం కానుంది. 'ప్రజ్ఞ' అందించే విశ్లేషణల ద్వారా హోంశాఖ తక్షణమే సరైన నిర్ణయాలు తీసుకోవడానికి వీలుంటుంది.
శాటిలైట్ ఇమేజింగ్ సిస్టమ్ 'ప్రజ్ఞ'తో సరిహద్దు ప్రాంతాల్లో అక్రమ చొరబాటుదారులు, ఉగ్రవాదుల కదలికలను ఎప్పటికప్పుడు కనిపెట్టవచ్చు. దేశంలోని సమస్యాత్మక ప్రాంతాల్లో శాంతిభద్రతలను పర్యవేక్షించడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. ఏవైనా అవాంఛనీయ సంఘటనలు జరిగినప్పుడు తక్షణమే సమాచారాన్ని విశ్లేషించి బలగాలను అప్రమత్తం చేసే అవకాశం ఉంటుంది. ఇది భారత అంతర్గత భద్రతా వ్యవస్థకు బిగ్ బూస్ట్ అని రక్షణ నిపుణులు చెబుతున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..