ఆప్ ఎంపీల అధికారిక విలీనం కంప్లీట్.. మారిన రాజ్యసభ ముఖచిత్రం
ఆప్ ఎంపీల అధికారిక విలీనం కంప్లీట్.. మారిన రాజ్యసభ ముఖచిత్రం
Aap


ఢిల్లీ, 27 ఏప్రిల్ (హి.స.)

అధికార బీజేపీ పార్టీలో రాఘవ్ చద్దా (Raghav Chadha) నేతృత్వంలోని ఆప్ ఎంపీల చేరిక అధికారికంగా పూర్తికావడంతో రాజ్యసభ (Rajya Sabha) ముఖచిత్రం మారిపోయింది. ఈ మేరకు రాజ్యసభ సచివాలయం పార్టీల వారీగా సభ్యుల బలాబలాలను ప్రకటిస్తూ సోమ వారం తాజా బులిటెన్ను విడుదల చేసింది. తాజా విలీనంతో ఎగువ సభలో బీజేపీ తన స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకుంది. గతంలో ఉన్న సభ్యులకు అదనంగా ఆప్ నుంచి వచ్చిన ఏడుగురు ఎంపీలు తోడవడంతో బీజేపీ సంఖ్యాబలం ఏకంగా 113కు పెరిగింది. దీంతో కీలక బిల్లుల ఆమోదం సమయంలో ఎన్డీయే (NDA) కూటమికి మరింత ఊతం లభించనుంది. మరోవైపు రాజ్యసభలో ఆప్ బలం 3కు పడిపోయింది.

ఢిల్లీ, పంజాబ్ రాజకీయాల్లో చక్రం తిప్పుతున్న ఆమ్ ఆద్మీ పార్టీ (Aam Aadmi Party)కి ఈ పరిణామంతో తలనొప్పిగా మారింది. రాజ్యసభలో ఆ పార్టీ ప్రాతినిధ్యం గణనీయంగా తగ్గిపోయింది. విలీనమైన ఎంపీలందరూ నిబంధనలకు అనుగుణంగానే బీజేపీలో చేరినట్లుగా రాజ్యసభ వర్గాలు ధృవీకరించాయి.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande