అనిల్ అంబానీకి భారీ ఊరట: 'డెబ్ ఫ్రీ'గా రిలయన్స్ పవర్
న్యూఢిల్లీ, 23 ఏప్రిల్ (హి.స.) ఒకప్పుడు అప్పుల ఊబిలో కూరుకుపోయిన అనిల్ అంబానీ (Anil Ambani) నేతృత్వంలోని రిలయన్స్ పవర్ లిమిటెడ్, ఇప్పుడు ఫీనిక్స్లో పుంజుకుంటోంది. కంపెనీ తన రుణాలను పూర్తిగా చెల్లించి, రుణ విముక్త (Debt-Free) హోదాను సాధించడంతో ఇన
అనిల్ అంబానీ


న్యూఢిల్లీ, 23 ఏప్రిల్ (హి.స.)

ఒకప్పుడు అప్పుల ఊబిలో

కూరుకుపోయిన అనిల్ అంబానీ (Anil Ambani) నేతృత్వంలోని రిలయన్స్ పవర్ లిమిటెడ్, ఇప్పుడు ఫీనిక్స్లో పుంజుకుంటోంది. కంపెనీ తన రుణాలను పూర్తిగా చెల్లించి, రుణ విముక్త (Debt-Free) హోదాను సాధించడంతో ఇన్వెస్టర్లలో కొత్త ఉత్సాహం నెలకొంది. ఈ సానుకూల వార్తతో స్టాక్ మార్కెట్లో రిలయన్స్ పవర్ షేర్లు భారీ లాభాలను గడిస్తున్నాయి. అయితే, రిలయన్స్ పవర్ తన బ్యాంక్ అప్పులన్నింటినీ తీర్చేసింది. ఇటీవల కంపెనీ వివిధ బ్యాంకులతో సెటిల్మెంట్ పూర్తి చేసి, సుమారు రూ.1,023 కోట్ల బకాయిలను క్లియర్ చేసినట్లుగా సమాచారం.

దీంతో ఏడాది కనిష్ట స్థాయి నుంచి రిలయన్స్ పవర్ షేర్ ఏకంగా 45 శాతం పైగా వృద్ధిని సాధించింది. ఇన్వెస్టర్లు ఎగబడి కొనుగోలు చేస్తుండటంతో షేరు ధర నిలకడగా పెరుగుతోంది. అప్పుల భారం తగ్గడంతో ఇప్పుడు కంపెనీ తన పూర్తి దృష్టిని కార్యకలాపాల విస్తరణ, గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులపై పెట్టే అవకాశం ఉంది. గత కొన్నేళ్లుగా అనేక ఇబ్బందులను ఎదుర్కొన్న అనిల్ అంబానీకి, రిలయన్స్ పవర్, రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీలు సాధిస్తున్న పురోగతి ఊరటనిచ్చే అంశమని బిజినెస్ ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande