
న్యూఢిల్లీ, 23 ఏప్రిల్ (హి.స.)
శబరిమల ఆలయ ప్రవేశానికితాము సంబంధించిన కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చినా దాన్ని స్వాగతించాలని అయితే, వాట్సాప్ యూనివర్సిటీ నుంచి వచ్చే సమాచారాన్ని మాత్రం పరిగణించబోమని జస్టిస్ నాగరత్న వ్యాఖ్యానించారు. శబరిమల కేసు విచారణలో భాగంగా ఎనిమిదవ రోజు ఇవాళ సుప్రీంకోర్టులో వాదనలు జరిగాయి. దావూదీ బోహ్రా సమాజం తరపున వాదనలు వినిపిస్తున్న సీనియర్ న్యాయవాది నీరజ్ కిషన్ కౌల్ తన వాదనలో భాగంగా సమాచారం ఏ మూలం నుంచి వచ్చినా జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని స్వీకరించడంలో తప్పు లేదని పేర్కొన్నారు. మతపరమైన అంశాలపై న్యాయవ్యవస్థ సంయమనం పాటించాలని కాంగ్రెస్ సీనియర్ నేత శశి థరూర్ రాసిన ఒక వ్యాసాన్ని ఆయన ఈ సందర్భంగా ఉదహరించారు.
న్యాయవాది నీరజ్ కిషన్ కౌల్ వాదనపై స్పందించిన సీజేఐ (CJI) జస్టిస్ సూర్యకాంత్.. ప్రముఖ రచయితలు, మేధావులను తాము గౌరవిస్తామని, అయితే ఆ వ్యాసం కేవలం ఒక వ్యక్తిగత అభిప్రాయం మాత్రమేనని వ్యక్తిగత అభిప్రాయం ఎప్పుడూ వ్యక్తిగత అభిప్రాయమే అన్నారు. కోర్టుకు ఏమాత్రం బాధ్యతాయుతమైనది (binding) కాదని సూచించారు. దీంతో కిషన్ కౌల్ స్పందిస్తూ.. ఏ మూలం నుంచైనా ఏ దేశం నుంచైనా ఏ విశ్వవిద్యాలయం నుంచైనా జ్ఞానం, విజ్ఞానం వస్తే దాన్ని ఆహ్వానించాలి. అన్ని రకాల జ్ఞానాన్ని స్వీకరించేంత గొప్ప నాగరికత మనది బదులిచ్చారు. దీంతో వెంటనే జోక్యం చేసుకున్న జస్టిస్ నాగరత్న.. 'వాట్సప్ యూనివర్సిటీ నుంచి వచ్చే సమాచారాన్ని' మాత్రం కాదు అంటూ వ్యాఖ్యానించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు