
ఢిల్లీ, 24 ఏప్రిల్ (హి.స.)
టెక్ దిగ్గజం మెటా (Meta) సంస్థ మరోసారి భారీ స్థాయిలో లేఆఫ్స్ కు సిద్ధమైంది. AI ఎఫెక్ట్ వల్ల ఉద్యోగాల కోతకు గురవుతుండటంతో ప్రపంచవ్యాప్తంగా సాఫ్ట్వేర్ రంగంలో ఆందోళన మొదలైంది. ప్రస్తుతం మెటాలో సుమారు 80,000 మంది ఉద్యోగులు పనిచేస్తుండగా, అందులో 10 శాతం మందిని, అంటే దాదాపు 8,000 మందిని తొలగించాలని సంస్థ నిర్ణయించింది. అలాగే కొత్తగా భర్తీ చేయాల్సిన మరో 6,000 ఓపెన్ పోస్టులను కూడా రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఫలితంగా 14,000 ఉద్యోగాలపై ఈ నిర్ణయం ప్రత్యక్షంగా ప్రభావం చూపనుంది. ఈ లేఆఫ్ ప్రక్రియ మే 20 నుండి మొదటి విడతగా ప్రారంభం కానుందని, 2026 ద్వితీయార్థంలో మరిన్నిదశలు కొనసాగే అవకాశం ఉందని సమాచారం.
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV