
న్యూఢిల్లీ, 24 ఏప్రిల్ (హి.స.)
ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజీవాల్
నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్ )కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ కీలక నేత, రాజ్యసభఎంపీ రాఘవ్ చద్దా అధికారికంగా భారతీయ జనతా పార్టీ (బీజేపీ)లో చేరారు. ఆయనతో పాటు మరో ఇద్దరు ఆప్ రాజ్యసభ ఎంపీలు సందీప్ పాఠక్, అశోక్ మిట్టల్ కూడా కాషాయ కండువా కప్పుకోవడం రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది. ఈ ముగ్గురి చేరికతో ఆప్ పార్లమెంటరీ పార్టీ బీజేపీలో విలీనం అయంది. బీజేపీలో చేరిన అనంతరం రాఘవ్ చద్దా ఆప్ అధిష్టానంపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రస్తుతం ఆమ్ ఆద్మీ పార్టీ పూర్తిగా అవినీతి పరుల చేతుల్లోకి వెళ్లిపోయింది. పార్టీ సిద్ధాంతాలకు తిలోదకాలు ఇచ్చారు అంటూ వారు ఘాటు వ్యాఖ్యలు చేశారు. పార్టీలో నిజాయితీ కలిగిన వారికి చోటు లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
గత కొన్ని రోజులుగా ఆప్ నాయకత్వంతో విభేదిస్తున్న రాఘవ్ చద్దాను, ఇటీవలే రాజ్యసభలో పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పదవి నుంచి ఆప్ తొలగించింది. ఈ పరిణామం జరిగిన కొద్ది రోజుల్లోనే ఆయన పార్టీ మారడం గమనార్హం. రాఘవ్ చద్దాతో పాటు మరో ఇద్దరు రాజ్యసభ ఎంపీలు కూడా బీజేపీలో చేరడంతో పార్లమెంటులో ఆప్ గణనీయంగా తగ్గింది. బలం పార్టీలో అత్యంత కీలకమైన యువ నేత బీజేపీలోకి వెళ్లడం కేజీవాల్కు రాజకీయంగా పెద్ద సవాలుగా మారింది. -
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..