ఏఐసీసీ మరో కీలక నిర్ణయం.. 3 రాష్ట్రాలకు ఎస్సీ విభాగం స్టేట్ చైర్మన్ల నియామకం
ఏఐసీసీ మరో కీలక నిర్ణయం
ఏఐసీసీ మరో కీలక నిర్ణయం.. 3 రాష్ట్రాలకు ఎస్సీ విభాగం స్టేట్ చైర్మన్ల నియామకం


ఢిల్లీ, 24 ఏప్రిల్ (హి.స.)

అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (AICC) పలు రాష్ట్రాల ఎస్సీ విభాగాలకు గాను నూతన చైర్మన్లను నియమించింది. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆమోదం మేరకు ఆంధ్రప్రదేశ్, పంజాబ్, మహారాష్ట్ర రాష్ట్రాలకు ఎస్సీ విభాగం స్టేట్ చైర్మన్లను ఖరారు చేస్తూ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ శుక్రవారం ఉదయం ఉత్తర్వులు జారీ చేశారు. ఆ ఉత్తర్వుల ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్సీ విభాగం చైర్మన్గా చిలక విజయ్ కుమార్, పంజాబ్కు గురుప్రీత్ సింగ్ లక్కీ పఖోకే, మహారాష్ట్ర ఎస్సీ విభాగం నూతన చైర్మన్ అనిరుద్ధ ధోందుజీ వంకర్ బాధ్యతలు స్వీకరించారు.

అచితే, ఈ ఉత్తర్వులు వెంటనే అమల్లోకి వచ్చేలా నియామకాలను చేపట్టినట్లు ఏఐసీసీ వెల్లడించింది. రాబోయే రోజుల్లో ఆయా రాష్ట్రాల్లో దళిత వర్గాల్లో పార్టీని మరింత బలోపేతం చేసే లక్ష్యంతో ఈ ఎంపికలు జరిగినట్లుగా తెలుస్తోంది. ఏపీ ఎస్సీ విభాగం చైర్మన్గా నియమితులైన చిలుక విజయ్ కుమార్ పట్ల పలువురు కాంగ్రెస్ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande