
కోల్కతా: , 24 ఏప్రిల్ (హి.స.)ప్రధాని మోదీ(PM Modi) శుక్రవారం హూగ్లీ నదిలో విహరించారు. ఓ కెమెరాతో ఆయన ఆ నదిలో విహరిస్తూ కొన్ని ఫోటోలు తీశారు. గంగా నదికి ఆయన పూజలు కూడా చేశారు. ఏప్రిల్ 29వ తేదీ రోజున రెండో దఫా ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన బెంగాలీ నావికులతో కాసేపు గడిపారు. వారి డిమాండ్లను ఆయన అడిగి తెలుసుకున్నారు. బోటులో షికారు చేస్తూ ప్రధాని మోదీ తన చేతిలో ఉన్న కెమెరాతో ఫోటోలు తీశారు. ఆయన తన ఎక్స్ అకౌంట్లో ఫోటోలు షేర్ చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi