'నీతి ఆయోగ్'లో కొత్త టీమ్ ఖరారు: వైస్ చైర్ పర్సన్ గా డాక్టర్ అశోక్ లాహిరి
'నీతి ఆయోగ్'లో కొత్త టీమ్ ఖరారు: వైస్ చైర్ పర్సన్ గా డాక్టర్ అశోక్ లాహిరి
Niti aayog


న్యూఢిల్లీ, 25 ఏప్రిల్ (హి.స.)

భారత ప్రభుత్వ థింక్ ట్యాంక్ 'నీతి

ఆయోగ్' (NITI Aayog)లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. నీతి ఆయోగ్ కొత్త వైస్ చైర్పర్సన్గా ప్రముఖ ఆర్థికవేత్త డాక్టర్ అశోక్ లాహిరి (Ashok Lahiri), సభ్యుడిగా ప్రఖ్యాత శాస్త్రవేత్త డాక్టర్ గోబర్దన్ దాస్ నియమితులయ్యారు. (Gobardhan Das)

నాలుగు దశాబ్దాలకు పైగా సుదీర్ఘ అనుభవం ఉన్న డాక్టర్ అశోక్ లాహిరి దేశంలోని అత్యంత సీనియర్ ఆర్థికవేత్తలలో ఒకరుగా ఉన్నారు. ఆయన గతంలో భారత ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారుగా (CEA), ఫైనాన్స్ కమిషన్ సభ్యునిగా సేవలందించారు. అదేవిధంగా ఆసియా అభివృద్ధి బ్యాంక్ (ADB), ప్రపంచ బ్యాంక్ (World Bank), అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) వంటి అంతర్జాతీయ సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించిన అనుభవం ఆయనకు ఉంది. ఇక నీతి ఆయోగ్ సభ్యునిగా ఎంపికైన డాక్టర్ గోబర్ధన్ దాస్ మూడు దశాబ్దాలుగా మాలిక్యులర్ సైన్స్ ప్రొఫెసర్గా విశేష గుర్తింపు పొందారు. ఇమ్యునాలజీ, అంటు వ్యాధులు, సెల్ బయాలజీ విభాగాల్లో ఆయన పేరుగాంచారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande