ఉత్తర భారతంలో రాత్రి వేళల్లో వేడి గాలులు
ఢిల్లీ, 25 ఏప్రిల్ (హి.స.): దేశవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఉత్తర, దక్షిణ భారత్‌కు ఐఎండీ హీట్‌వేవ్ హెచ్చరికలు జారీ చేసింది. రాజస్థాన్‌లోని శ్రీగంగానగర్‌లో 44.5°C గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. తీర ప్రాంతాల్లో వేడి-తేమతో వాతావరణ మండుతోంది. ఉత్
ఉత్తర భారతంలో రాత్రి వేళల్లో వేడి గాలులు


ఢిల్లీ, 25 ఏప్రిల్ (హి.స.): దేశవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఉత్తర, దక్షిణ భారత్‌కు ఐఎండీ హీట్‌వేవ్ హెచ్చరికలు జారీ చేసింది. రాజస్థాన్‌లోని శ్రీగంగానగర్‌లో 44.5°C గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. తీర ప్రాంతాల్లో వేడి-తేమతో వాతావరణ మండుతోంది. ఉత్తర భారతంలో రాత్రి వేళల్లో వేడి గాలులు వీస్తున్నాయి. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఐఎండీ సూచించింది.

మధ్యాహ్నం 12 గంటల నుంచి 4 గంటల వరకు ఎండలో బయటకు వెళ్లొద్దని ఐఎండీ హెచ్చరించింది. తగినంత నీళ్లు తాగాలని.. తేలికపాటి బట్టలు ధరించాలి. బయట శ్రమతో కూడిన పనులు నివారించాలని వాతావరణ శాఖ సూచించింది. పిల్లలు, వృద్ధులు, అనారోగ్య సమస్యలు ఉన్నవారు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని.. ఏప్రిల్-జూన్‌లో తూర్పు, మధ్య, ఉత్తర-పశ్చిమ భారత్‌లో సాధారణం కంటే ఎక్కువ హీట్‌వేవ్ రోజులు ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది.

ఐఎండీ తాజా అంచనాల ప్రకారం.. వాయువ్య, మధ్య, ద్వీపకల్ప భారతదేశంలోని పలు ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు (40°C నుండి 44°C) మధ్య నమోదవుతున్నాయి. రాజస్థాన్‌లోని శ్రీ గంగానగర్‌లో అత్యధికంగా 44.5°C ఉష్ణోగ్రత నమోదైంది. పలు ప్రాంతాల్లో సాధారణం కంటే 5°C, అంతకంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తోంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు


 rajesh pande