
ఢిల్లీ, 25 ఏప్రిల్ (హి.స.)
రాఘవ్ చడ్డా ఆమ్ ఆద్మీ పార్టీని వీడి బీజేపీలో చేరుతున్నట్లు ప్రకటించడంతో సోషల్ మీడియాలో ఆయనపై తీవ్రమైన విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా ప్లాట్ఫారమ్లలో నెటిజన్లు చడ్డాను తీవ్రంగా ట్రోల్ చేస్తున్నారు. అలాగే ఆప్లో ఉన్నప్పుడు చడ్డా ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్లు 14.6 మిలియన్ల ఉండగా, ఇప్పుడు ఆ సంఖ్య 13.7 మిలియన్లకు పడిపోయింది. అంటే ఏకంగా దాదాపు 10 లక్షల మంది ఫాలోవర్లు తగ్గారు. మరోవైపు, పార్టీలో సంక్షోభాన్ని చక్కదిద్దే పనిలో ఆమ్ ఆద్మీ పార్టీ నిమగ్నమైంది. పార్టీలో నెలకొన్న పరిస్థితులపై నాయకులు చర్చలు జరిపారు. శుక్రవారం రాత్రి గుజరాత్ పర్యటన ముగించుకుని దిల్లీకి వచ్చారు ఆప్ సీనియర్ నేత మనీశ్ సిసోదియా. విమానాశ్రయం నుంచి నేరుగా ఆప్ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ను నివాసానికి వెళ్లారు. పార్టీలో నెలకొన్న సంక్షోభంపై ఇరువురు నేతలు చర్చించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi