జైల్లోనే విద్య- బోర్డు ఎగ్జామ్స్లో ఖైదీలు అదుర్స్- 10th క్లాస్లో 100శాతం ఉత్తీర్ణత
జైల్లోనే విద్య- బోర్డు ఎగ్జామ్స్లో ఖైదీలు అదుర్స్- 10th క్లాస్లో 100శాతం ఉత్తీర్ణత
జైల్లోనే విద్య- బోర్డు ఎగ్జామ్స్లో ఖైదీలు అదుర్స్- 10th క్లాస్లో 100శాతం ఉత్తీర్ణత


గాజియాబాద్, 26 ఏప్రిల్ (హి.స.)

ఉత్తర్ప్రదేశ్లోని గాజియాబాద్ జిల్లా జైలు ఇప్పుడు చదువుల కేంద్రం నిలుస్తోంది. జైలంటే కేవలం శిక్ష అనుకునే పరిస్థితుల్లో కూడా విద్యతో కొత్త జీవితాన్ని అందిస్తోంది. జైలు గోడల మధ్య విద్యా దీపం వెలిగిస్తూ ఖైదీలను అక్షరాస్యులుగా తీర్చిదిద్దుతోంది. అందుకు ఉదాహరణనే 10, 12 వతరగతి పరీక్ష ఫలితాలు. ఖైదీలు జైల్లో ఉండి చదువుకుంటూ ఉత్తరప్రదేశ్ మాధ్యమిక విద్యా మండలి నిర్వహించిన 10వ, 12వ తరగతి పరీక్షల్లో విశేష ప్రతిభ కనబరిచారు. హైస్కూల్లో 100 శాతం ఉత్తీర్ణత నమోదు కాగా, ఇంటర్మీడియట్లో 95 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు.

2025-26 విద్యా సంవత్సరంలో హైస్కూల్ పరీక్షలకు మొత్తం ఐదుగురు ఖైదీలు హాజరయ్యారు. వీరిలో ఒకరు ఫస్ట్, నలుగురు సెకండ్ క్లాస్లో ఉత్తీర్ణులయ్యారు. దీంతో హైస్కూల్లో 100 శాతం ఫలితాలు నమోదయ్యాయి. ఇంటర్మీడియట్ పరీక్షలకు మొత్తం 18 మంది ఖైదీలు హాజరుకాగా, అందులో 17 మంది ఉత్తీర్ణులయ్యారు. వీరిలో 11 మంది సెకండ్ క్లాస్, 6 మంది థర్డ్ క్లాస్లో పాస్ అయ్యారు. ఒకరు మాత్రమే ఫెయిల్ అయ్యారు. మొత్తం మీద 95 శాతం ఉత్తీర్ణత నమోదైంది

ఈ విజయానికి జైలు అధికారి సీతారామ్ శర్మ కీలక ప్రాత పోషించారు. ఖైదీలను చదువుపై ప్రోత్సహించేందుకు జైలు యాజమాన్యం ప్రత్యేక చర్యలు చేపట్టింది. జైలు ప్రాంగణంలో లైబ్రరీ ఏర్పాటు చేసి అవసరమైన పుస్తకాలను అందుబాటులో ఉంచారు. ఖైదీలు అక్కడే కూర్చొని చదవడమే కాకుండా, పుస్తకాలను తీసుకుని తమ సెల్లో కూడా అభ్యసించే అవకాశం కల్పించారు. బోర్డు పరీక్షలకు ముందు ప్రత్యేక తరగతులు నిర్వహించి ఖైదీలకు సన్నద్ధత కల్పించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande