
న్యూఢిల్లీ, , 26 ఏప్రిల్ (హి.స.
భూమధ్య రేఖకు సమీపంలోని పసిఫిక్ మహా సముద్రంలో ఉపరితల ఉష్ణోగ్రతలు తీవ్రంగా, వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో ఈ ఏడాది ఎల్నినో ప్రభావం తప్పదని ప్రపంచ వాతావరణ విభాగం (డబ్ల్యూఎంవో) సూచించింది. ఈ ఏడాది మే నుంచి జూలై నెల మధ్యలో భారత్లో ఎల్నినో ప్రభావం ఉంటుందని పేర్కొంది. దీంతో జూలై నెలలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదవుతుందని తెలిపింది. ఈ ఏడాది ప్రారంభంలో కొంతకాలం తటస్థ వాతావరణ పరిస్థితులు ఉన్నప్పటికీ ఇప్పుడు మార్పు బలంగా కనిపిస్తున్నదని డబ్ల్యూఎంవో చీఫ్ విల్ఫ్రాన్ మౌఫూమా చెప్పారు. ఎల్నినో ఏర్పడటం అవశ్యమని, ఆ తరువాత అది మరింత తీవ్రతరమవుతుందని హెచ్చరించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi