అమెరికాకు చెందిన మరో ఎఫ్-35ని కూల్చేశాం.. ఇరాన్
అమెరికా ఫైటర్ జెట్ ను కూల్చేసిన ఇరాన్
War


న్యూఢిల్లీ, 03 ఏప్రిల్ (హి.స.)

పశ్చిమాసియా (West Asia)లో.

ఉద్రిక్తత వేళ ఇరాన్ (Iran) సంచలన ప్రకటన చేశారు. అమెరికాకు చెందిన అత్యంత అధునాతన ఎఫ్-35 (F-35) స్టెల్త్ ఫైటర్ జెట్ను తమ సైన్యం కూల్చివేసినట్లుగా తెలిపింది. సెంట్రల్ ఇరాన్ గగనతలంలోకి ప్రవేశించిన అమెరికా (America) ఫైటర్ జెట్ను ఇరాన్ రక్షణ వ్యవస్థలు విజయవంతంగా అడ్డుకుని కూల్చేశాయని ఇరాన్ వార్తా సంస్థ 'మెహర్' వెల్లడించింది. విమానం కూలిపోయిన తీరును బట్టి అందులోని పైలట్ ప్రాణాలతో బయటపడే అవకాశం లేదని ఇరాన్ అధికారులు భావిస్తున్నారు. యుద్ధ విమానాన్ని కూల్చడమే కాకుండా, ఇరాన్ తన రివల్యూషనరీ గార్డ్స్ ద్వారా ఇజ్రాయెల్లోని టెల్ అవీవ్, పైలాట్ నౌకాశ్రయాలపై సుదూర శ్రేణి క్షిపణులతో దాడులు చేసింది.

అయితే, ఈ ఘటనపై అమెరికా సెంట్రల్ కమాండ్ (CENTCOM) అధికారికంగా ధృవీకరించాల్సి ఉండగా ఎలాంటి ప్రకటన వెలువడలేదు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande