
ఢిల్లీ, 02 ఏప్రిల్ (హి.స.)
మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మరోసారి భగ్గుమన్నాయి.
బహ్రెయిన్లోని అమెజాన్ క్లౌడ్ కంప్యూటింగ్ సదుపాయంపై ఇరాన్ దాడి చేసినట్లు
ఫైనాన్షియల్ టైమ్స్ను ఉటంకిస్తూ రాయిటర్స్ సంచలన కథనాన్ని ప్రచురించింది. ఈ దాడి
తర్వాత ఓ కంపెనీ ప్రాంగణంలో మంటలు చెలరేగాయని,
వాటిని అదుపులోకి తెచ్చామని బహ్రెయిన్ అంతర్గత
వ్యవహారాల మంత్రిత్వ శాఖ ధ్రువీకరించింది. అయితే, ఆ కంపెనీ పేరును
గానీ, నష్టం
వివరాలను గానీ వెల్లడించలేదు.
అమెరికా,
ఇజ్రాయెల్ దాడులకు ప్రతీకారంగా పశ్చిమాసియాలో
అమెజాన్, యాపిల్, టెస్లా వంటి
అమెరికన్ కంపెనీలను లక్ష్యంగా చేసుకుంటామని ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) హెచ్చరించిన
మరుసటి రోజే ఈ దాడి జరగడం గమనార్హం. ఈ ఘటనపై అమెజాన్ ఇంకా అధికారికంగా
స్పందించలేదు. అయితే, గతవారమే ఈ ప్రాంతంలో డ్రోన్ కార్యకలాపాల కారణంగా తమ అమెజాన్
వెబ్ సర్వీసెస్ (AWS)కు అంతరాయం కలిగిందని కంపెనీ అంగీకరించింది
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi