సొంత పార్టీకి రాఘవ్ చద్దా స్ట్రాంగ్ వార్నింగ్
ఆమ్ అద్మీ పార్టీకి రాఘవ్ చద్దా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు.
సొంత పార్టీకి రాఘవ్ చద్దా స్ట్రాంగ్ వార్నింగ్


ఢిల్లీ, 05 ఏప్రిల్ (హి.స.)

ఆమ్ ఆద్మీ పార్టీలో (ఆప్) అంతర్గత విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి. తనపై సొంత పార్టీ నేతలు చేస్తున్న విమర్శలపై రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దా తీవ్రంగా స్పందించారు. పంజాబ్ సమస్యలను పార్లమెంటులో ప్రస్తావించడం లేదన్న ఆరోపణలను తిప్పికొడుతూ, తాను రాష్ట్రం కోసం పనిచేస్తున్నానని స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా ఓ వీడియో క్లిప్ను పంచుకున్నారు. రాజ్యసభలో తాను పంజాబ్ సమస్యలపై మాట్లాడుతున్న దృశ్యాలు ఆ వీడియోలో ఉన్నాయి.

రాఘవ్ చద్దా పంజాబ్ సమస్యలను పార్లమెంటులో ప్రస్తావించడంలో విఫలమయ్యారని వీడియోలు విడుదల చేయమని ఒత్తిడికి గురైన నా సహచరులకు ఇది ఒక చిన్న ట్రైలర్ మాత్రమే... పిక్చర్ అభీ బాకీ హై అని ఆయన తన పోస్టులో పేర్కొన్నారు. పంజాబ్ తనకు కేవలం చర్చనీయాంశం కాదని, అది తన ఇల్లు, విధి, మట్టి, ఆత్మ అని ఆయన ఉద్ఘాటించారు.

ఇటీవల రాజ్యసభలో ఆప్ ఉప నేత పదవి నుంచి రాఘవ్ చద్దాను తొలగించిన తర్వాత ఈ వివాదం మొదలైంది. పార్టీలో కొందరు నేతలు ఆయనపై బహిరంగంగానే విమర్శలు గుప్పించారు. దీనిపై చద్దా శనివారం స్పందిస్తూ, నాపై మూడు ఆరోపణలు చేశారు. అందులో సున్నా శాతం నిజం ఉంది. నేను మౌనంగా ఉంటే, పదేపదే చెప్పే అబద్ధం కూడా నిజంలా అనిపిస్తుంది అని పేర్కొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande