
తమిళనాడు, 05 ఏప్రిల్ (హి.స.)కేంద్ర సర్కార్పైన, సీబీఎస్ఈపైన తమిళనాడు సీఎం, డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. హిందీ మాట్లాడే రాష్ర్టాల్లోని విద్యార్థులు తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం వంటి దక్షిణాది భాషలను తప్పనిసరిగా నేర్చుకుంటారా? అని కేంద్రాన్ని ప్రశ్నించారు. భాషల గురించి రాష్ర్టాలకు కేంద్రం నీతులు చెప్పడం ద్వంద్వ నీతికి పరాకాష్ఠగా ఆయన ఎద్దేవా చేశారు. త్రిభాషా విధానం వల్ల హిందీ మాట్లాడే విద్యార్థులకే ఉన్నత విద్య, ఉద్యోగాల్లో ప్రయోజనం చేకూరుతున్నదని, రాష్ర్టాల మధ్య అసమానతలు పెరుగుతాయని స్టాలిన్ హెచ్చరించారు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, యానిమేషన్, గేమింగ్ వంటి ఆధునిక రంగాల్లో విద్యార్థులకు నైపుణ్యాలు అందించాల్సిన ఈ తరుణంలో వారిపై అదనపు భాషా భారాన్ని మోపటం సరికాదని అన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi