మళ్లీ షాకిచ్చిన బంగారం ధరలు.. ఒక్కసారిగా పేలిన బాంబ్.. ఇప్పుడు తులం ఎంతంటే..?
పెరిగిన బంగారం ధరలు
Gold


ముంబై, 08 ఏప్రిల్ (హి.స.)అంతర్జాతీయ పరిణామాలు, ఇరాన్తో యుద్దంపై ట్రంప్ ప్రకటన క్రమంలో స్టాక్ మార్కెట్లు ఊగిసలాటలో కొనసాగుతున్నాయి. ఇక అంతర్జాతీయ పరిణామాలకు బంగారం ధరలు త్వరగా ప్రభావితం అవుతాయి. అందలో భాగంగా ట్రంప్ ఎఫెక్ట్ పసిడి ధరలపై పడింది. ప్రస్తుతం ధరలు ఎలా ఉన్నాయంటే..

బంగారం ధరలు ఊహించని షాకిచ్చాయి. గంటల వ్యవధిలోనే ధరలు మారాయి. ఇరాన్తో యుద్దానికి విరామం ఇస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటన చేసిన క్రమంలో పసిడి ధరల్లో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. ఇరాన్ కూడా యుద్దానికి గ్యాప్ ఇస్తున్నట్లు ప్రకటించింది. ఈ క్రమంలో గోల్డ్, సిల్వర్ రేట్లల్లో భారీగా హెచ్చుతగ్గులు నమోదువుతున్నాయి. బుధవారం గోల్డ్ రేట్లు ఒక్కసారిగా పెరిగాయి.

ప్రస్తుతం హైదరాబాద్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,53,820 వద్ద కొనసాగుతోంది.

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande