
ముంబై, 07 ఏప్రిల్ (హి.స.)
దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం ప్రారంభంలోనే భారీ నష్టాలను మూటగట్టుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి అందుతున్న ప్రతికూల సంకేతాలు, ఇన్వెస్టర్ల లాభాల స్వీకరణతో సూచీలు ఒక్కసారిగా కుప్పకూలాయి. ట్రేడింగ్ ప్రారంభమైన కొద్దిసేపటికే అమ్మకాల ఒత్తిడి తీవ్రం కావడంతో ఇన్వెస్టర్ల సంపద భారీగా ఆవిరైంది. ఉదయం 9.30కి బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ (BSE) సెన్సెక్స్ ఏకంగా 418 పాయింట్లు పతనమై 73,683 వద్ద ట్రేడ్ అవుతోంది. ఇక నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ నిఫ్టీ సైతం భారీగా నష్టపోయింది. ట్రేడింగ్ మొదలైన కాసేపటికే నిఫ్టీ (NIFTY) 90 పాయింట్ల నష్టంతో 22,877 వద్ద కొనసాగుతోంది. ఇక డాలర్తో పోలిస్తే భారత కరెన్సీ రూపాయి 17 పైసలు నష్టపోయి 93.07 వద్ద ట్రేడ్ అవుతోంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..